తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కి మహేష్ స్పెషల్ విషెష్.!

Published on May 31, 2022 10:00 am IST


ఈరోజు ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో ఘట్టమనేని అభిమానులు సినీ ప్రముఖులు వారిలో వీరి అభిమానులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ స్పెషల్ డే కి గాను ఆ సూపర్ స్టార్ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో తెలియజేసారు.

“హ్యాపీ బర్త్ డే నాన్న, ఈ ప్రపంచంలో మీలా మరొక ఉన్నతమైన వ్యక్తి లేరు. మీరు ఎన్నో ఏళ్ళు ఇలా ఆనందంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుని ఆశీసులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను లవ్ యు” అంటూ మహేష్ బాబు తన ప్రేమను తన తండ్రిపై వ్యక్తం చేశారు. మరి ఇదిలా ఉండగా రీసెంట్ గా మహేష్ నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ కావడంతో ఆ హిట్ ని ఆస్వాదిస్తూ వెకేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత జూలై నుంచి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం :