గౌతమ్ గ్రాడ్యుయేషన్ పై మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

Published on May 27, 2022 12:16 am IST

మహేష్ బాబు ఖాళీ టైం ఎప్పుడు దొరికిన తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. తాజాగా గౌతమ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాడు. ఇంతకీ పోస్ట్ లో ఏమి పెట్టాడంటే.. ‘బ్రెన్నర్స్ పార్క్-హోటల్ లో ఘట్టమనేని గౌతమ్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలు అంటూ మహేష్ ఒక పోస్ట్ పెట్టాడు.

ఈ సందర్భంగా మహేష్, గౌతమ్ ను ఉద్దేశించి మెసేజ్ చేస్తూ.. ‘గౌతమ్ గర్వంగా ఉంది!! ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి’ అని అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో మహేష్ – గౌతమ్ మధ్య అనుబంధం, ప్రేమ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా సితార, గౌతమ్‌ల తో మహేష్ ఎప్పుడు సరదాగా గడపడం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది.

సంబంధిత సమాచారం :