కోటి మార్కును తాకిన మహేష్ ‘స్పైడర్ ‘ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్ర టీజర్ నిన్న ఉదయం విడుదలై ఇప్పటికీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూనే ఉంది. అభిమానులతో పాటు సోషల్ మీడియా జనాలు కూడా టీజర్ ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో మొదటి 24న గంటల్లోనే 8.6 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం 10 మిలియన్ల అనగా కోటి వ్యూస్ ను తాకేసింది.

‘బాహుబలి’ ని మినహాయిస్తే ఒక తెలుగు టీజర్ ఇంత వేగంగా కోటి వ్యూస్ ను అందుకోవడం ఇదే మొదటిసారేమో. దీన్నిబట్టి ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఎంతటి కుతూహలం ఉందో అర్థమవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రేజ్ వలన ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలోనే జరిగింది. ఎస్. జె సూర్య, భరత్ లు ప్రతి నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.