శ్రీదేవి కుమార్తెను సంప్రదించలేదంటున్న ‘మహేష్’ టీమ్

jahnavi
నిన్న మొన్నటి దాకా ‘మహేష్ బాబు’ చిత్రంపై అనేక రకమైన పుకార్లు వార్తల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి మహేష్ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ ‘శ్రేదేవి, బోనీ కపూర్’ ల కుమార్తె ‘జాహ్నవి’ ని హీరోయిన్ రోల్ కోసం అడిగారని, కానీ ఆమె అందుకు నో చెప్పిందని వార్తలొచ్చాయి. దీంతో మహేష్ బృందం ఈ వార్తలపై స్వయంగా ఓ ప్రకటన చేసింది.

ఈ చిత్రం కోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుని ‘పరిణితీ చోప్రా’ ను సంప్రదించామని కానీ కుదరక ‘రకుల్ ప్రీత్ సింగ్’ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశామని, అంతేగాని శ్రీదేవి కుమార్తె జాహ్నవి ని అసలు ఈ విషయంపై సంప్రదించలేదని, ఈ రూమర్లన్నీ ఎలా వచ్చాయో తెలియదడంలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే జాహ్నవి తండ్రి ‘బోనీ కపూర్’ కూడా తన కూతురికి మహేష్ బాబు సినిమా కోసం ఎలాంటి సంప్రదింపులు రాలేదని చెప్పారు. నిర్మాతలు ‘ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు’ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.