బిగ్ బాస్ షోలో మెరవబోతున్న స్పైడర్ ?

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్ర విడుదల తేదీ దగ్గర పడే కొద్ది చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇప్పటికే దర్శకుడు మురుగదాస్ ఇంటర్వ్యూల ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలని మొదలు పెట్టేసాడు. తాజా సమాచారం ప్రకారం త్వరలో మహేష్ బాబు చిత్ర ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోలో పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. మహేష్ పాల్గొనబోయేది తమిళ వెర్షన్ బిగ్ బాస్ షో లో.

తమిళ బిగ్ బాస్ షో కి విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా మహేష్ పాల్గొనే విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మహేష్ బాబుని తమిళ్ లో లాంచ్ చేసేందుకు త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించనున్నారు.