‘స్పైడర్’ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న మహేష్ !


షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో హాలీడే ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రేపటి నుండి హైదరాబాద్లో మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో మహేష్ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ తో మిగిలిఉన్న కొద్దీ టాకీ పార్ట్ ను, ఒక పాటను పూరి చేస్తారట. దీంతో చిత్రీకరణ మొతం పూర్తికానుంది.

అలాగే మే 31వ తేదీన కృష్ణగారి జన్మదిన సందర్బంగా టీజర్ ను రిలీజ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడం, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.