సుమంత్ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న మహేష్!
Published on Sep 26, 2016 8:50 am IST

naruda-donaruda
2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ కనిపించలేదు. కాగా ఈసారి ఎలాగైనా బలమైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే సుమంత్ ఈ గ్యాప్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాను సుమంత్ ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించగా, సెప్టెంబర్ 27న ట్రైలర్‌తో ఆ ఆసక్తి మరింత పెంచాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి. తనకు మంచి మిత్రుడైన సుమంత్ కోరిక మేరకు మహేష్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారట. వీర్యం దానం చేసే ఓ యువకుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని టీం చెబుతూ వస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్రలో నటించారు.

 
Like us on Facebook