‘విన్నర్’ పాటను విడుదల చేయనున్న మహేష్!


మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ అనే సినిమా ఈనెల్లోనే పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలను రేకెత్తించగా, థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను త్వరలోనే విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఇక ఈ ఆడియోలోని మొదటిపాటను ఆడియో వేడుకకు ముందే నేడు విడుదల చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పాటను విడుదల చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

మహేష్ ఈసాయంత్రం 7 గంటలకు ‘సితార’ అనే పాటను విడుదల చేస్తారని, ఆయన ఈ పాటను విడుదల చేసేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అంటూ టీమ్ ఈ ప్రకటన విడుదల చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.