హాలీడే నుండి తిరిగొచ్చిన మహేష్ !

Published on Jan 7, 2018 7:24 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన మహేష్ కొద్దిరోజుల క్రితం బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ ట్రిప్ ను ముగించుకున్న అయన షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టనున్నారు.

రేపటి నుండి హైదారాబాద్లో షూట్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లోనే మహేష్, హీరోయిన్ కైరా అద్వానీపై కొన్ని కెలక సన్నివేశాలతో పాటు పాటల్ని కూడా చిత్రీకరించనున్నారు. మహేష్ తో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ను తీసిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More