‘సర్కారు’ డేట్ తో ‘పోకిరి’ రోజులు మళ్ళీ తీసుకురానున్న మహేష్.?

Published on Oct 3, 2021 12:05 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమాతో మళ్ళీ పోకిరి వైబ్స్ ని ఖచ్చితంగా తీసుకొస్తున్నాం అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పుడు సరికొత్త టాక్ వినిపిస్తుంది.

బహుశా ఈ సినిమా కనుక సంక్రాంతికి రాకుంటే అప్పుడు పోకిరి సినిమా రిలీజ్ టైం ఏప్రిల్ నెలకి ఈ సినిమా షిఫ్ట్ అవుతుందట. పోకిరి డేట్ ఏప్రిల్ 28 కి రాగా మరి ఈ డేట్ కే బహుశా సర్కారు వారి పాట కూడా ల్యాండ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది జనవరికి ఆగినా పోకిరి డేట్ అనేసరికి ఇంకా భారీ హైప్ రావొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :