ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ను వాడుకోవాలనుకుంటున్న మహేష్

mahesh
సెప్టెంబర్ 1న విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతూ బ్రహ్మాండమైన కలెక్షన్లను రాబడుతోంది ‘జనతా గ్యారేజ్’ చిత్రం. మొదట సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సినిమాలోని కొన్ని అంశాలు మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వాటిలో ప్రధానమైనది ఆర్ట్ వర్క్. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ సినిమాలో కీలకమైన జనతా గ్యారేజ్ సెట్ వేయడానికి చాలానే కష్టపడ్డాడు. రాష్ట్రంలోని ఉన్న పలు గ్యారేజీలు తిరిగి మరీ సెట్ ను అద్భుతంగా వేశారు.

ఇప్పుడు ఈ అద్భుతమైన సెట్లోనే సూపట్ స్టార్ మహేష్ బాబు తన 23వ చిత్రం షూటింగ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్న మహేష్ తిరిగి రాగానే చెన్నైలో షూటింగ్ రీస్టార్ట్ చేస్తాడు. అక్కడ షెడ్యూల్ కంప్లీట్ అవగానే సెట్లో కొన్ని మార్పులు చేసి సినిమాలోని కీలకమైన ఓ యాక్షన్ సీక్వెన్స్, పాటను కూడా అందులోనే షూట్ చేయాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.