“బిగ్ సి”కి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు..!

Published on Sep 25, 2021 2:00 am IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే ఎన్నో కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడన్న సంగతి మంకి తెలిసిందే. తాజాగా మరో కంపెనీకి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఎలక్ట్రానిక్ బ్రాండ్ “బిగ్ సి”కి మహేశ్ బాబు ఇకపై బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నాడు. నేడు హైదరాబాద్‌లో జరిగిన “బిగ్ సి” కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో 300కి పైగా స్టోర్లను కలిగి ఉన్న బ్రాండ్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :