మురుగదాస్ సినిమాలో మహేష్ రోల్ ఏంటంటే..!

mahesh
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే చెన్నైలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ రోల్ గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. ఆయన గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, యాక్టింగ్‌తో మహేష్ మెప్పించనున్నట్లు తెలుస్తోంది.

ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‍గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. హరీస్ జైరాజ్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.