పవన్ అగ్రెసివ్ స్పీచ్..మహేష్ ట్వీట్ వైరల్.!

Published on Sep 26, 2021 1:00 pm IST

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న సాయి తేజ్ సినిమా “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన అగ్రెసివ్ స్పీచ్ నే వైరల్ అవుతుంది. మరి ఇదిలా ఉండగా సినీ వర్గాల నుంచి కూడా భారీ ఎత్తునే పవన్ కి మద్దతు వస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పవన్ మాట్లాడిన ఈ స్పీచ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడో పదేళ్ల కిందట పెట్టిన ట్వీట్ బాగా రిలేటెడ్ గా ఉందని అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందటే..

“ఎవరో చెప్తే విన్నాను నిన్న పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడాడు అని, అది విని నేనేమి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి”. అని ఉంది. అయితే ఇది పదేళ్ల కితందే అయినా కూడా నిన్నటి పరిస్థితికి బాగా సింక్ అయ్యేలానే ఉందని చెప్పాలి. దీనితో ఇప్పుడు ఈ ట్వీట్ ఒక లెక్కలో వైరల్ అవుతుంది. మరి ఇద్దరు బాక్సాఫీస్ స్టామినా కోసం అలాగే ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని అనుకునే వారు ఎంతమంది ఉన్నారో కూడా అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :