తన కొత్త సినిమాలని ప్రకటించిన మహేష్ బాబు !
Published on Jan 1, 2017 9:26 am IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సంవత్సరం సందర్బంగా 2017లో తను చేయబోయే కొత్త సినిమాలను ప్రకటించాడు. ఎన్నాళ్లగానో ఈ వార్త కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మహేష్ చేసిన ట్వీట్లతో సంబరపడిపోతున్నారు. ఇక మహేష్ చెప్పిన ప్రకారం తన 24వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనుంది. అలాగే 25వ చిత్రం అశ్విని దత్, దిల్ రాజుల సంయుక్త నిర్మాణంలో ఉండనుంది.

అలాగే తన 26వ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్లో ఉండనుందని, ఈ సంవత్సరం తన కెరీర్లో ఎక్సయిటింగా ఉండనుందని మహేష్ సంతోషం వ్యక్తం చేశాడు. మహేష్ చేసిన ఈ ప్రకటనతో కొన్ని రోజులుగా వంశీ పైడిపల్లితో చేయబోయే ప్రాజెక్టుకు ఇబ్బంది ఏమీ లేదని కూడా తేలిపోయింది. ఇకపోతే ప్రస్తుతం న్యూ ఇయర్ హాలీడే లో ఉన్న మహేష్ ఈ వారంలో తిరిగొచ్చి జనవరి 7 నుండి మురుగదాస్ తో చేస్తున్న సినిమా యొక్క కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడు.

 
Like us on Facebook