ట్రైలర్ తో అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేయనున్న మహేష్.!

Published on Apr 30, 2022 4:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మూడు వరుస హిట్స్ తర్వాత చేసిన భారీ చిత్రం “సర్కారు వారి పాట”. ఆ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత దర్శకుడు పరశురామ్ పెట్ల తో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మహేష్ కెరీర్ లోనే ఒక సరికొత్త ఇంపాక్ట్ ని తీసుకొచ్చే సినిమాగా నిలిచి అందరిలోని ఒక ఆసక్తిని తీసుకొచ్చింది. మరి ఎట్టకేలకు ఈ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయ్యిపోతుంది.

అయితే ఈ గ్యాప్ లో సినిమాకి సాలిడ్ ప్రమోషన్స్ అవుతున్నాయి అలాగే ట్రైలర్ కి కూడా డేట్ వచ్చేయడంతో దానిపై భారీ అంచనాలు పెట్టుకొని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ తో మాత్రం మహేష్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ఎలా ఉంటాడో అనేది ఇప్పటివరకు చిన్న టీజర్ అలాగే పోస్టర్స్ లో మాత్రమే చూసాము.

కానీ ఈ ట్రైలర్ తో మాత్రం అదిరే ట్రీట్ ని ఇవ్వడం మాత్రం గ్యారెంటీ అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వింటేజ్ మహేష్ బాబుని చూసేది లేనిది కూడా ఈ ట్రైలర్ తోనే అందరికీ ఒక క్లారిటీ రావడం గ్యారెంటీ అందుకే ఈ ట్రైలర్ పై మరింత ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :