“సర్కారు వారి” కోసం మహేష్ ఇంకాస్త ముందే రెడీ.?

Published on Dec 30, 2021 10:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ గత సినిమాలతో పోలిస్తే సరికొత్తగా కనిపించబోతున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కాలికి జరిగిన చిన్న సర్జరీ తర్వాత దుబాయ్ లో మహేష్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ సర్జరీ తర్వాత మహేష్ కాస్త ఎక్కువ రెస్ట్ నే తీసుకుంటారని తెలిసింది కానీ లేటెస్ట్ గా మాత్రం మహేష్ కాస్త ముందే సర్కారు వారి పాట షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

ముందు అయితే మహేష్ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చెయ్యాల్సి ఉంది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం జనవరిలోనే మహేష్ షూట్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరి మొదటి వారంలో రానుంది.

సంబంధిత సమాచారం :