పాన్ ఇండియా సినిమాకి మహేష్ జాయిన్ అయ్యేది అప్పుడేనట!

Published on Oct 8, 2021 2:05 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా అనంతరం మహేష్ తన హ్యాట్రి దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

పైగా ఇది పాన్ ఇండియన్ లెవెల్లో ఉండబోతుంది అని నిర్మాత కూడా కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా నుంచి కూడా ఎప్పటికప్పుడు మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

అయితే తాజా బజ్ ప్రకారం మహేష్ తన మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమాను వచ్చే నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేసేయనున్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటిలోపు సర్కారు వారి పాట కంప్లీట్ చేసేసి ఇందులోకి దిగిపోవడం పక్కా అని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :