‘మహేష్ 23’ హైద్రాబాద్ షెడ్యూల్ ముగిసింది..!
Published on Nov 13, 2016 9:49 am IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ నెలరోజులుగా హైద్రాబాద్‌లో జరుగుతూ వస్తోంది. మహేష్ పాల్గొనగా పలు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన టీమ్, నిన్నటితో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసేసింది. ఇప్పటివరకూ 60% పైనే పూర్తైన షూట్ ఔట్‌పుట్‌పై టీమ్ చాలా హ్యాపీగా ఉందట.

ఇదే నెల 24 నుంచి అహ్మదాబాద్‍లో మరో భారీ షెడ్యూల్ మొదలుకానుంది. అహ్మదాబాద్ షెడ్యూల్ తర్వాత షూటింగ్ చివరిదశకు చేరుకుంటుందని సమాచారం. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.

 
Like us on Facebook