రేపట్నుంచి ‘మహేష్ 23’ కొత్త షెడ్యూల్..!

30th, October 2016 - 07:53:19 PM

mahesh-murgadoss-in
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. గత వారం వరకూ హైద్రాబాద్‌లో పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో హోరెత్తించిన టీమ్, తాజాగా దీపావళి పండగను పురస్కరించుకొని షూట్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక రేపట్నుంచి ఈ షెడ్యూల్ మళ్ళీ మొదలుకానుంది. రేపు మొదలయ్యే ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు హైద్రాబాద్‌లోనే జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 22 నుండి అహ్మదాబాద్‌లో మరో షెడ్యూల్ జరగనుంది.

ఇండియన్ సినిమాలో కమర్షియల్ దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న మురుగదాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందనుకున్నా, జనవరి వరకూ ఫస్ట్‌లుక్ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సోషల్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.