హైదరాబాద్లో మహేష్ సినిమా !


సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివల కాంబినేషన్లో ప్లాన్ చేసిన కొత్త సినిమా నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ యొక్క మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో వేసిన ఒక ఇంటి సెట్లో జరుపుతున్నారు. అక్కడ కొరటాల శివ మహేష్ బాబు చిన్ననాటి సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ సుమారు 4 రోజుల పాటు జరపనున్నారు.

ఇది పూర్తైన తర్వాత రెండవ షెడ్యూల్ ను జూన్ 16వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారు. మహేష్ ఈ షెడ్యూల్ నుండి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇకపోతే ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.