మహేష్ – కొరటాల సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !


మహేష్ బాబు – కొరటాల శివ కాంబిషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సాధించిన ఘనవిజయంతో మరోసారి వీరు చేయనున్న ప్రాజెక్ట్ పై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇపటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తై ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మే నెల 22వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారు.

కానీ మహేష్ మాత్రం మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న ‘స్పైడర్’ చిత్రం పూర్తయ్యాక అనగా జూన్ రెండవ వారం నుండి షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ను ఖరారు చేసిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను 2018 ఆరంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.