తమిళంలో విడుదలకు సిద్ధమైన మహేష్ ఫస్ట్ మూవీ !


సూపర్ స్టార్ మహేష్ బాబు కు తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉంది.మహేష్ గత చిత్రాలు దూకుడు, 1 నేనొక్కడినే తమిళంలోకి అనువాదం అయ్యాయి. కాగా మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ ఇపుడు తమిళంలో విడుదలవుతుండడం విశేషం.

రాజకుమారుడు చిత్రం 1999 లో విడుదలైంది. దానిని ఇప్పుడు తమిళంలో ‘తునిచల్కారన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 27 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా అశ్వినిదత్ నిర్మించారు.మహేష్ సరసన ప్రీతిజింతా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు.