ఈసారి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఐ ఫీస్ట్ ఖాయమా ?

Published on Mar 29, 2023 9:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న SSMB 28 మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన అతడు, ఖలేజా మూవీస్ రెండూ అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకున్నాయి. అతడు సూపర్ హిట్ అవ్వగా, ఖలేజా మాత్రం సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా ఈ రెండూ కూడా కల్ట్ క్లాసిక్స్ గా నిలిచి ప్రస్తుతం టివి లో ఎన్నిసార్లు ప్రసారం అయినప్పటికీ కూడా మంచి రేటింగ్స్ అందుకోవడం విశేషం. దానితో ప్రస్తుత SSMB 28 భారీ సక్సెస్ కొడుతుందని అందరూ ఆశిస్తున్నారు.

మరోవైపు త్రివిక్రమ్ కూడా ఈ మూవీపై మరింత భారీగా ఫోకస్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల బజ్. ఈ మూవీలో మహేష్ బాబు ఊర మాస్ రోల్ లో కనిపించనున్నారని, కొన్నేళ్లుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన నుండి ఆశిస్తున్న మాస్ యాక్షన్ అంశాలు అన్ని ఈ సినిమాలో ఉండనున్నాయట. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కేవలం జస్ట్ శాంపిల్ మాత్రమే అని, ఫ్యాన్స్ కోసం సినిమాలో ఎన్నో అంశాలు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈమూవీ ఓటిటి రైట్స్ రూ. 81 కోట్లకు అలానే ఆడియో రైట్స్ రూ. 27 కోట్లకు అమ్ముడై టాలీవుడ్ లో సంచలన రికార్డు సృష్టించడం విశేషం. మరి రిలీజ్ తరువాత ఈ ప్రతిష్టాత్మక మూవీ ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతుందో తెలియాలి అంటే 2024, జనవరి 13 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :