మహేష్‌ను అయోమయంలో పడేసిన పవన్!

mahesh-pawan
సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరికీ తెలుగు సినీ అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి, వాళ్ళ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానుల కోలాహలం కూడా మామూలుగా ఉండదు. సాధారణంగా ఈ ఇద్దరి సినిమాలూ పోటీకి రాకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే కోవలో పవన్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమాకు ఒక విడుదల తేదీ ఫిక్స్ అయిపోవడంతో మహేష్ సినిమా అయోమయంలో పడింది.

మహేష్ – మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘మహేష్ 23’ని మార్చి నెలాఖర్లో విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నట్లు ఎప్పట్నుంచో వినిపించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి 2’ ఏప్రిల్ నెలాఖర్లో రానుండడంతో ఆ సినిమాకు నెల రోజుల ముందొస్తే బాగుంటుందని, ‘మహేష్ 23’ నిర్మాతలు భావిస్తూ వచ్చారు. ఇప్పుడు సరిగ్గా మార్చి నెలాఖర్లో 29వ తేదీకి ‘కాటమరాయుడు’ రానుండడం ఈ ప్లాన్ మొత్తాన్నీ మార్చేసింది. ఇప్పుడు ఏప్రిల్, మే నెలలు ‘కాటమరాయుడు’, ‘బాహుబలి 2’ సినిమాలతోనే నిండిపోనున్నాయి. దీంతో మహేష్ సినిమా వస్తే మే తర్వాతే రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్‌ను మహేష్ సినిమా మిస్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మహేష్ సినిమా రిలీజ్‌కు దర్శక, నిర్మాతలు ఏ నెలను సెట్ చేస్తారా అన్నది చూడాలి.