మహేష్ సినిమా ముందుకు జరిగే అవకాశాముందా ?
Published on Dec 4, 2017 3:28 pm IST

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 27 న విడుదల కానుందని చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమాను కాస్త ముందుకు జరిపి ఏప్రిల్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ఆలోచన చేస్తున్నారట చిత్ర యూనిట్. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా వేగవంతం చేశారట యూనిట్ .

ఏప్రిల్ 27న అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ విడుదల కానుంది. అందుకే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే కలెక్షన్లు దెబ్బతినే అవకాశముంది కాబట్టి మహేష్, కొరటాల సినిమాను రెండు వారాల ముందుకు జరిపారట. అయితే ఈ వార్తలో ఏ మేరకు వాస్తవముందో తెలియాలంటే యూనిట్ సభ్యుల నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook