ఫారిన్ లో మొదలుకానున్న మహేష్ కొత్త చిత్రం ?
Published on Apr 5, 2017 5:49 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల సేవల హిట్ కాంబినేషనలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ఫిక్సయిఅన్ ఈ ప్రాజెక్ట్ కోసం కొరటాల శివ ఇప్పటికే పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని మహేష్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కానిచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ – మురుగదాస్ ల చిత్రం కంప్లీట్ కావోస్తుండటంతో శివ ఈ చిత్ర షూటింగ్ ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫారిన్ లో మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట.

ఎందుకంటే మహేష్ ఇందులో ఎన్నారై రోల్ లో కనిపిస్తాడు కనుక అక్కడి నుండే షూట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచనట. ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన ఈ సినిమా దేశభక్తి అంశం ఆధారంగా రూపొందించబడిందట. సోషల్ ఎలిమెంట్ ను స్ట్రైకింగా చెప్పడం కంటే పెద్ద కమర్షియల్ పాయింట్ మరొకటి లేదని నమ్మే కొరటాల ఈ సినిమా కోసం దేశం భక్తి అంశాన్ని ఎంచుకోవడంతో చిత్రంపై ఇప్పటి నుండే అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇకపోతే డివివి దానయ్య నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు.

 
Like us on Facebook