‘సర్కారు’లో ఆ సీక్వెన్సే మెయిన్ హైలైట్ !

Published on Oct 11, 2021 11:22 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. పూర్తీ కన్ ఫ్యూజన్ డ్రామాతో పరశురామ్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఈ కామెడీ ట్రాక్ ను రాశాడని.. ఈ సీక్వెన్స్ లో మహేష్ తో పాటు వెన్నల కిశోర్, మిగిలిన ప్రధాన కమెడియన్లు కనిపించబోతున్నారని తెలుస్తోంది.

కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పరశురామ్ సూపర్ కామెడీ సీక్వెన్స్ ను రాశాడని, ఈ సీక్వెన్స్ లో బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మధ్య అద్భుతమైన కామెడీ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడు. ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :