మహేష్ ఫస్ట్ లుక్ హడావుడి ఇంకా తగ్గలేదు !
Published on Apr 16, 2017 5:41 pm IST


మహేష్ అభిమానులు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తూ పలుసార్లు ఆశాభంగానికి గురైన విషయం ‘స్పైడర్’ ఫస్ట్ లుక్. ఫ్యాన్స్ ను ఎంతో వెయిట్ చేయించిన టీమ్ ఎట్టకేలకు ఏప్రిల్ 12న ఫస్ట్ లుక్ ను, టైటిల్ తో సహా రీలీజ్ చేశారు. దీంతో అభిమానులు అప్పటి వరకు అంచిపెట్టుకున్న ఉత్సాహాన్నంతా సోషల్ మీడియా మీద ఒక్కసారిగా చూపించేశారు. దీంతో ఫస్ట్ లుక్ విడుదలైన కొద్దిసేపటికే నేషనల్ ట్రెండింగ్స్ లో నిలిచింది. అంతేగాక 24 గంటలు గడవడక ముందే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్స్ సొంతం చేసుకుంది.

మొదటి రోజు కాబట్టి సందడి అలానే వుంటుందని అనుకోవచ్చు కానీ రిలీజై నాలుగు రోజులవుతున్న మోషన్ పోస్టర్ సందడి యూట్యూబ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మోషన్ పోస్టర్ 2 మిలియన్ల వ్యూస్ ను, 69 వేల పై చిలుకు లైక్స్ ను సొంతం చేసుకుని మహెహ్స్ ఖాతాలో సరికొత్త రికార్డ్స్ ను చేరుస్తోంది. ఇకపోతే మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్,రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాని జూన్ ఆఖరి వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం.

 
Like us on Facebook