‘స్పైడర్’ మొదటిరోజు నైజాం షేర్ వివరాలు!

28th, September 2017 - 03:44:41 PM

మహేష్ – మురుగదాస్ ల భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ భారీ అంచనాలు నడుమ నిన్ననే థియేటర్లలోకి దిగింది. చిత్రం పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉండటం వలన ఓపెనింగ్స్ బాగానే దక్కాయి. కానీ ట్రేడ్ వర్గాలు ఊహించినదానికంటే ఈ మొత్తం కొద్దిగా తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా మహేష్ కు మంచి పట్టున్న నైజాం ఏరియాలో ఈ తగ్గుదల కనబడింది.

ట్రేడ్ సమాచారం ప్రకారం నైజాంలో ఫస్ట్ డే ఈ చిత్రం రూ. 4.3 కోట్లను రాబట్టింది. మహేష్ కెరీర్లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్ అయినప్పటికీ ఈ మధ్య విడుదలైన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం ఎపి, నైజాం ఏరియాల టాప్ 10 లిస్టులో 9న స్థానానికి పరిమితమైంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో మహేష్ తమిళంలో కూడా అధికారికంగా లాంచ్ అయ్యారు.