‘స్పైడర్’ షూటింగ్ అప్డేట్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మిగిలిన కొంచెం టాకీని కూడా ముగించేయనుంది. జూన్ 13న మొదలుకానున్న ఈ షెడ్యూల్ నాలుగు రోజుల వరకు కొనసాగనుంది. దీని తర్వాత మిగిలిన పాటలను జూలైలో షూట్ చేస్తారు.

ఈ మధ్యనే విడుదలైన టీజర్ కొత్తగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో తెలుగులోనే కాక తమిళంలో కూడా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం. ఇకపోతే మహేష్ ఐబీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ ముగిసిన తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా షూట్లో జాయిన్ అవుతారు.