మహేష్ “సర్కారు వారి పాట” కి ఫస్ట్ టైమ్ షాకింగ్ టీఆర్పీ!

Published on Oct 7, 2022 12:36 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇటీవల స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

ఈ చిత్రం కి ఊహించని రీతిలో 9.45 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పాలి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :