మహేష్ “సర్కారు వారి పాట” సెన్సేషన్ సండే!

Published on May 22, 2022 10:20 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి, విజయవంతం గా ప్రదర్శింప బడుతుంది.

ఈ చిత్రం ఆదివారం రోజు దాదాపు అన్ని థియేటర్ల వద్ద హౌజ్ ఫుల్ బోర్డ్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా, ఆలోచింప జేసేలా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :