యూఎస్ లో “సర్కారు వారి పాట” మాస్ కలెక్షన్స్!

Published on May 23, 2022 11:32 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. యూఎస్ లోనూ యాక్షన్ డ్రామా బాగానే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కాస్త స్లో అయింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆదివారం 155 లొకేషన్ల నుండి 26,573 డాలర్లు వసూలు చేసింది. దీంతో సినిమా టోటల్ కలెక్షన్స్ 2,291,728 డాలర్లు కాగా, ట్రేడ్ ప్రకారం ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉండాలంటే రెండున్నర మిలియన్లు దాటాల్సిందే. ఇది కాకుండా, సర్కార్ వారి పాట మహేష్ యొక్క సరిలేరు నీకెవ్వరు 2,288,613 డాలర్లు కలెక్షన్లను క్రాస్ చేసింది మరియు US లో మహేష్ యొక్క బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :