యూఎస్ బాక్సాఫీస్ వద్ద “సర్కారు వారి పాట” జోరు…2 మిలియన్ మార్క్ టచ్!

Published on May 16, 2022 11:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బిజినెస్ చేస్తోంది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయిక. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది.

మహేష్ బాబు కెరీర్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేసిన 4 వ చిత్రం గా ఇది నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ చిత్రంలో సముద్ర ఖని, నదియా, నాగబాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కూడా భాగమయ్యారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :