‘ జై లవ కుశ’ లీకేజ్ వెనకున్న ప్రధాన అనుమానితుడు ఇతడే !


నిన్న ఉదయం ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ సినిమా యొక్క టీజర్ తాలూకు విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో అనధికారికంగా విడుదలై సంచలనం సృష్టించిన తెలిసిందే. ఈ లీకేజ్ వలన దాదాపు మొత్తం టీజర్ కు సంబందించిన రఫ్ కట్స్ బయటకొచ్చి ఇన్నాళ్లు కష్టపడ్డ చిత్ర యూనిట్ కు ఆవేదనకు గురిచేసింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది.

నిర్మాతల నుండి కంప్లైంట్ అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు విచారణ జరిపి ఈ లీకేజ్ వెనకున్న ప్రధాన అనుమానితుడు గణేష్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారం కొనసాగుతుండగా దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనే వివరాల్ని త్వరలోనే కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ను జూలై మొదటి వారంలో రిలీజ్ చేసి చిత్రాన్ని సేపేటెంబర్ 21న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.