భారీ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య సినిమా !
Published on Dec 3, 2017 10:42 am IST

అక్కినేని నాగ చైతన్య చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దానికి తగ్గట్టే చందూ మొండేటి కూడా నాగ చైతన్యను ఇది వరకెన్నడూ చూడని విధంగా కొత్తగా చూపిస్తానని కూడా అంటున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన, భారీ ఇంటి సెట్లో జరుగుతోంది. అక్కడ నటుడు మాధవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం.

 
Like us on Facebook