‘మజ్ను’ ఆడియో డేట్ కన్ఫర్మ్ !

23rd, August 2016 - 11:55:45 AM

majnu
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్న సహజ నటుడు నాని ‘జెంటిల్మెన్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత లవ్ అండ్ ఎంటర్టైనర్ ‘మజ్ను’ సినిమాని చేస్తున్నాడు. ‘ఉయ్యాలా జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకుడిగా ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్’ పై గీత గొల్ల, పి. కిరణ్ ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ కొద్దిరోజుల క్రితమే విడుదలై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

తాజా ఈ చిత్రంలోని మొదటి పాటకు సంబందించిన లిరికల్ వీడియో ‘కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే’ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి ఆడియో ఆగష్టు 26న విడుదల కానుందని హీరో నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇకపోతే నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 17న విడుదలకానుంది.