‘మజ్ను’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!
Published on Sep 25, 2016 9:49 am IST

nani-majnu
నాని హీరోగా నటించిన ‘మజ్ను’, గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఏడాదిన్నరలో నాలుగు హిట్స్ కొట్టిన నాని, ‘మజ్ను’తో తన హిట్ పరంపరను కొనసాగిస్తాడన్న అంచనాలు మొదట్నుంచీ కనిపించాయి. ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విడుదలైన సినిమా మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్‌నే రాబడుతోంది. ఇక నానికి కొద్దికాలంగా మంచి మార్కెట్‌గా అవతరించిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ప్రీమియర్ షోస్, శుక్రవారం కలుపుకొని యూఎస్‌లో మజ్ను సినిమా, 167కే డాలర్లు (సుమారు 1.12 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. టాక్ బాగుండడంతో శని, ఆదివారాలు కలెక్షన్స్ మరింత బాగుంటాయని ట్రేడ్ భావిస్తోంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అనూ ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook