యూఎస్‌లో హాఫ్ మిలియన్‌కు దగ్గరైన ‘మజ్ను’!
Published on Sep 27, 2016 9:31 pm IST

nani-majnu
నాని హీరోగా నటించిన ‘మజ్ను’, గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఏడాదిన్నరలో నాలుగు హిట్స్ కొట్టిన నాని, ‘మజ్ను’తో తన హిట్ పరంపరను కొనసాగిస్తాడన్న అంచనాలు మొదట్నుంచీ కనిపించాయి. ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విడుదలైన సినిమా మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్‌నే రాబడుతోంది. ఇక నానికి కొద్దికాలంగా మంచి మార్కెట్‌గా అవతరించిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది.

ఇప్పటివరకూ యూఎస్‌లో ‘మజ్ను’ సినిమా, 404కే డాలర్లు వసూలు వసూలు చేసింది. టాక్ బాగుండడంతో వచ్చే వీకెండ్ తర్వాత కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ భావిస్తోంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అనూ ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook