‘నాని’ కొత్త సినిమా టీజర్ విడుదల !

majnu
వరుస హిట్లతో సక్సెస్ వేవ్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో ‘నాని’. చిన్నా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ప్రస్తుతం నిర్మాతలకు ఖచ్చితమైన సక్సెస్ అందించే హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం నాని ఉయ్యాల జంపాల ఫేమ్ ‘విరించి వర్మ’ దర్శకత్వంలో ‘మజ్ను’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదల ఈ చిత్రం తాలూకు ఫస్ట్ 2లుక్ విభిన్నంగా ఉంది అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి పాటల షూటింగ్ గోవాలో జరుగుతుండగా టీజర్ ఈరోజు మధ్యాహ్నం 12: 30 గంటలకు విడుదలకానుంది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ‘జెమిని కిరణ్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.