‘మజ్ను’ రెండు రోజుల నైజాం కలెక్షన్స్!
Published on Sep 25, 2016 8:04 pm IST

nani-majnu

నాని హీరోగా నటించిన ‘మజ్ను’, గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఏడాదిన్నరలో నాలుగు హిట్స్ కొట్టిన నాని, ‘మజ్ను’తో తన హిట్ పరంపరను కొనసాగిస్తాడన్న అంచనాలు మొదట్నుంచీ కనిపించాయి. ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విడుదలైన సినిమా మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్‌నే రాబడుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా కూడా సినిమా మంచి వసూళ్ళు రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి.

మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా నైజాంలో 1 కోటి 94 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అనూ ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook