ఏపీలో “షికారు” థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న “మేజర్” డిస్ట్రిబ్యూటర్.!

Published on Jun 15, 2022 10:04 am IST


లేటెస్ట్ గా టాలీవుడ్ లో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూస్తున్నాము. మరి అలా ఎప్పటికప్పుడు ఈ తరహా పలు చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రమంలో కొత్తగా ఈ జూన్ 24న రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం “షికారు”. యంగ్ హీరోయిన్ సాయి ధన్షికా ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ లు హీరోలుగా నటించగా చమ్మక్ చంద్ర కీలక పాత్ర చేసాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమా తాలూకా ఏపీ థియేట్రికల్ రిలీజ్ హక్కులు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే గత వారం సూపర్ హిట్ సినిమా “మేజర్” ని వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ ఈ షికారు చిత్రానికి మొత్తం ఏపీ హక్కులు ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం ఆసక్తిగా మారింది.

దీనితో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రిలీజ్ హాట్ టాపిక్ గా మారగా అంతా జూన్ 24 కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. అలాగే పి ఎస్ ఆర్ కుమార్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :