ఓటిటిలో “మేజర్” రిలీజ్ వచ్చేది అప్పుడే..!

Published on Jun 3, 2022 9:00 am IST

లేటెస్ట్ గా ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యిన మరో బై లాంగువల్ చిత్రం “మేజర్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించాడు.

అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఇపుడు తన స్ట్రీమింగ్ పార్ట్నర్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ “నెట్ ఫ్లిక్స్” ని లాక్ చేసుకోగా మరి ఇందులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన రెండు నెలల తర్వాత మాత్రమే ఓటిటిలో అందుబాటులోకి వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనితో అయితే ఈ ఎమోషనల్ చిత్రాన్ని ముందు థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :