యూఎస్ లో సాలిడ్ మైల్ స్టోన్ దిశగా “మేజర్” వసూళ్లు.!

Published on Jun 7, 2022 12:30 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “మేజర్”. దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ ఎమోషనల్ యాక్షన్ చిత్రం రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ ని సంతరించుకొని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా మంచి వసూళ్ళని విడుదల కాబడిన అన్ని చోట్ల నుంచి రాబడుతుంది.

అయితే ఈ చిత్రం యూఎస్ లో అయితే శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 9 లక్షల డాలర్స్ మార్క్ ని చేరుకోగా తర్వాత సాలిడ్ మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రంలో సాయి ఎం మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా మహేష్ నిర్మాణ సంస్థ జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ అలాగే సోనీ పిక్చర్స్ ఇండియా వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :