ఫస్ట్ డే వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న “మేజర్”.!

Published on Jun 4, 2022 2:00 pm IST

యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “మేజర్” మంచి అంచనాలు నడుమ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా ఇప్పుడు మరింత మంచి వసూళ్ల దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఎంత వసూళ్లు రాబట్టింది అనేది మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఫస్ట్ డే ఈ సినిమా భారీ మొత్తంలో 13.40 కోట్లు గ్రాస్ ను అందుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది అడివి శేష్ కెరీర్ లోనే భారీ మొత్తపు అత్యధికం. దీనితో ఈ సక్సెస్ పట్ల అడివి శేష్ ఎంతో ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా చాలా క్రెడిట్ వెళ్తుంది అని తెలియజేసాడు. ఇండియా లవ్స్ మేజర్ అంటూ ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తూ ఫస్ట్ డే వసూళ్లను వారు అనౌన్స్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :