బాలీవుడ్ లో “మేజర్” వసూళ్లు ఇవే!

Published on Jun 7, 2022 10:00 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంకి దేశ వ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో డీసెంట్ వసూళ్ళను రాబడుతోంది. సోమవారం 85 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇప్పటి వరకూ 5.5 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వసూళ్ళను రాబడుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :