నైజాం లో 5 కోట్ల కి చేరువలో అడివి శేష్ “మేజర్”

Published on Jun 6, 2022 1:00 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ మేజర్ తెలుగులో మంచి నోట్‌తో ప్రారంభమైంది. ఈ చిత్రం మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం వారాంతాల్లో మంచి ఆక్యుపెన్సీని చూసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మేజర్ ఆదివారం నైజాంలో 1.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ యాక్షన్ డ్రామా నైజాంలో ఇప్పటి వరకు టోటల్ గా 4.8 కోట్ల షేర్ సాధించింది.

అయితే వీక్ డేస్ స్టార్ట్ కావడంతో ఇకపై సినిమా ఎంత వరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. సోనీ పిక్చర్స్‌తో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :