హిందీలో “మేజర్” లేటెస్ట్ వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Jun 9, 2022 10:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ అడివి శేష్ మరియు సాయి మంజ్రేకర్ లు నటించిన లేటెస్ట్ సినిమా “మేజర్”. దర్శకుడు శశికిరణ్ తిక్క రియల్ హీరో లేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి టాక్ తో పాటుగా వసూళ్లు కూడా అడివి శేష్ కెరీర్ లోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. మరి హిందీలో అయితే ఈ చిత్రం డీసెంట్ రన్ ని కొనసాగిస్తోంది అని చెప్పాలి. మరి లేటెస్ట్ గా నిన్న బుధవారం వరకు వసూళ్లు చూసినట్టు అయితే ఈ ఆరు రోజుల్లో ఈ చిత్రం 7.12 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ మార్క్ లో స్టడీగా ఉంది వీకెండ్స్ లో మళ్ళీ పుంజుకుంటుంది మరి ఓవరాల్ గా అయితే ఫునల్ రన్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :