అడివి శేష్ “మేజర్” చిత్రం నుండి రేపు బిగ్ అనౌన్స్ మెంట్!

Published on Nov 2, 2021 11:00 am IST

అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ a+s మూవీస్ లా పై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత సంఘటన ల ఆధారం గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10:08 గంటలకు ఉండనుంది అని హీరో అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంతో మంది కొద్ది రోజులుగా అడుగుతున్న ప్రశ్న కి రేపు సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More